Breaking News

చస్…మెర్సల్ ని లేపేసిన సర్కార్..హ్యుమంగస్..!

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ ధలపతి విజయ్ ఏ.ఆర్. మురగదాస్ ల కాంబినేషన్ లో తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి సెలవుల్లో రిలీజ్ అయ్యి ఎలాంటి ఊచకోత కోసిందో అందరికీ తెలిసిందే. మొదటి రోజే 70 కోట్లకి పైగా గ్రాస్ తో మొదలైన ప్రభంజనం అలాగే కొనసాగుతూ ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని కూడా సాలిడ్ గా కొనసాగుతుంది.
కాగా సినిమా ఓవరాల్ గా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఇలయ దళపతి విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన మెర్సల్ సినిమా టోటల్ రన్ గ్రాస్ ని క్రాస్ చేసింది. మెర్సల్ టోటల్ రన్ లో 244.5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని కోలివుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
కాగా ఇప్పుడు 17 రోజుల్లోనే సర్కార్ సినిమా 245 కోట్లకు పైగా గ్రాస్ ని టోటల్ వైడ్ గా అందుకుందని కోలివుడ్ ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఏరియాల వారి డీటైల్స్ తెలియాల్సి ఉన్నా… ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సాధించాల్సి ఉంటుంది.