Breaking News

సీడెడ్ లో చరిత్ర సృష్టించిన అరవింద సమేత ఫైనల్ కలెక్షన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత ఫైనల్ రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది, కానీ రెండు రాష్ట్రాలలో మేజర్ సెంటర్స్ లో చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతూ వస్తుంది ఈ సినిమా. ఈ క్రమం లో సినిమా సీడెడ్ ఏరియాలో ఫైనల్ రన్ ని టోటల్ గా కంప్లీట్ చేసుకోగా సినిమా అక్కడ…
చరిత్ర సృష్టించింది. టోటల్ రన్ లో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను అక్కడ సాధించి చరిత్ర సృష్టించింది. బాహుబలి సిరీస్ తర్వాత అక్కడ రంగస్థలం టోటల్ రన్ లో 17.6 కోట్ల షేర్ ని అందుకుని చరిత్ర సృష్టించింది. కాగా 30 రోజులకు 16.57 కోట్ల షేర్ తో ఉన్న అరవింద సమేత….
మిగిలిన రన్ లో మరో 5 నుండి 6 లక్షల రేంజ్ లో అక్కడ కలెక్షన్స్ ని సాధించి టోటల్ గా 17.63 కోట్ల రేంజ్ షేర్ తో ఆల్ టైం హిస్టారికల్ న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ హోల్డర్ గా రాయలసీమ ఏరియా లో చరిత్ర సృష్టించింది.
సినిమాను అక్కడ టోటల్ గా 14 కోట్లకు అమ్మగా మొదటి రోజే రికార్డ్ లెవల్ లో 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి సంచలన ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన ఈ సినిమా మొదటి వారంలోనే అక్కడ 14 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది.
ఇక దసరా సెలవులు ముగిసే సమయానికి 16 కోట్లకు చేరువ అవ్వడంతో తర్వాత లాంగ్ రన్ లో భారీ గా స్లో డౌన్ అయినా టోటల్ గా ఫైనల్ రన్ లో అక్కడ సినిమా ఇప్పుడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ తో పరుగును ముగించింది. మిగిలిన ఏరియాల్లో కూడా ఫైనల్ రన్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు.