Breaking News

రాజమౌళి రివర్స్‌ స్ట్రాటజీ ఫలిస్తుందా?


 రాజమౌళి ముందుగా మల్టీస్టారర్‌ అనుకున్నపుడు అతని మైండ్‌లో ఒక ఐడియా వుందట. బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని కాకుండా కమర్షియల్‌ సినిమాని లార్జ్‌ స్కేల్‌లో చేద్దామనుకున్నాడట. నూట యాభై కోట్ల బడ్జెట్‌తో కేవలం తెలుగు మార్కెట్‌నే టార్గెట్‌ చేయాలని భావించి హీరోలిద్దరినీ సంప్రదించాడట. అయితే ఇతర భాషల నుంచి తన సినిమా పట్ల వ్యక్తమవుతోన్న ఆసక్తి తెలుసుకున్నాక, కేవలం ఒకే భాషకి పరిమితమయ్యే సినిమా చేయడం సరికాదని భావించి, అందుకు అనుగుణంగా కథ డిసైడ్‌ చేయడం మొదలు పెట్టాడట.
అంటే ఈసారి ముందుగా హీరోలని డిసైడ్‌ అయి, వారిద్దరినీ ఒక్కటి చేసే కథని రాసుకున్నారన్నమాట. ఎప్పుడూ కథ అనుకుని, దానికి తగిన హీరోని ఎంచుకోవడం రాజమౌళి శైలి. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌కి మాత్రం రివర్స్‌లో జరిగింది. హీరోలు డిసైడ్‌ అయిపోయి, ఆ తర్వాత వారితో యూనివర్సల్‌ అప్పీల్‌ వున్న చిత్రం చేయాలని డిసైడ్‌ అవడంతో మొత్తం ప్రాజెక్ట్‌ స్వరూపమే మారిపోయింది. నూట యాభై కోట్ల బడ్జెట్‌ అనుకున్నది కాస్తా మూడు వందల కోట్ల వరకు ఎస్టిమేషన్‌ వెళ్లింది. బాహుబలి చిత్రాల్లో ఒక భాగానికి అయిన ఖర్చు కంటే ఇది ఎక్కువే కావడం గమనార్హం.