Breaking News

6 సార్లు 100 కోట్లు…చరిత్రలో ఒకేఒక్కడు

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ తో సంచలనం సృష్టించింది. కాగా ఈ సినిమా తో విజయ్ టోటల్ సౌత్ లో మరే హిరో కి లేని అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 6 సార్లు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఆల్ టైం హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్ ను నెలకొల్పాడు.
ఇది వరకు విజయ్ నటించిన సినిమాల్లో కత్తి, పులి, తెరీ, భైరవ, మెర్సల్ ఇప్పుడు సర్కార్ సినిమాతో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నాడు. మధ్య లో పులి సినిమా 98 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్నా కోలివుడ్ ట్రేడ్ ఈ సినిమా ను కూడా 100 కోట్ల గ్రాస్ లో కలిపేశారు.
దాంతో మొత్తం మీద 6 సార్లు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించి సౌత్ లో మరే హిరో కి లేని విధంగా అల్టిమేట్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూస్తుంటే వీకెండ్ ముగిసే లోపు మరిన్ని భీభత్సమైన రికార్డులు నమోదు చేయవచ్చు అని చెప్పొచ్చు.