Breaking News

4D లో 120 కెమరాలతో మైండ్ బ్లాంక్ అయ్యే ఫైట్ సీన్

టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయిక లో తెరకెక్కుతున్న అల్టిమేట్ మెగా మల్టీ స్టారర్ మూవీ రీసెంట్ గా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఈ సినిమా ను చెప్పుకుంటున్నారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ లోనే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
కాగా ఆ ఫైట్ సీన్ ని 4D రోబోటిక్ టెక్నాలజీ ని వాడి సుమారు 120 కెమరాలతో చిత్రీకరిస్తున్నారట. హాలివుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సీన్ షాట్స్ ఉంటాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. కాగా సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది కన్ఫాం కాకున్నా…
2020 సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని అంటున్నారు. అప్పటి వరకు ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూపులు తప్పవనే చెప్పాలి. కానీ ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్టిమేట్ రికార్డుల వర్షం కురవడం ఖాయమని చెప్పొచ్చు.