Breaking News

450k ట్వీట్స్ తో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అల్టిమేట్ గిఫ్ట్..!

 టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ చేసి తమ అభిమానాన్ని చూపుకున్నారు. ట్రెండ్ మొదలు పెట్టిన 4 గంటలలోనే ఏకంగా 2 లక్షల 50 వేల కి పైగా ట్వీట్స్ పోల్ అవ్వగా తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయినా ఓవరాల్ గా 24 గంటల ని ఘనంగా ముగించినట్లు సమాచారం.
ఫైనల్ కౌంట్ క్లియర్ గా తెలియకపోయినా ఓవరాల్ గా 24 గంటలు ముగిసే సమయానికి టోటల్ గా 4 లక్షల 50 వేల రేంజ్ లో ట్వీట్స్ టోటల్ గా పోల్ అయినట్లు సమాచారం. మరో రెండేళ్ల వరకు ఎన్టీఆర్ నుండి సినిమా ఉండదు కాబట్టి అభిమానులు అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు.
ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కలయికలో టాలీవుడ్ నంబర్1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటుండగా సినిమాను 2020 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తారనే టాక్ ఉంది. ఆ సినిమా తో ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు.