Breaking News

నైజాం గడ్డపై 24 కోట్లు…మెగా ఊచకోత..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యమ జోరు మీదున్నాడు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ తో పాటు ఇండస్ట్రీ రికార్డులను రంగస్థలం సినిమా తో సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ వినయ విదేయ రామ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన అఫీషియల్ టీసర్ తో సినిమా పై ఉన్న అంచనాలు మరింత గా పెరిగి పోయాయి.
దాంతో బిజినెస్ పరంగా మరింత జోరుగా రికార్డుల దుమ్ము దులిపేస్తూ ఈ సినిమా బిజినెస్ దూసుకు పోతుంది. రీసెంట్ గా సినిమా నైజాం ఏరియా బిజినెస్ అల్టిమేట్ లెవల్ లో జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. సుమారు 24 కోట్ల రేంజ్ లో సినిమా…
ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాం ఏరియా కి గాను జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఈ ఆఫర్ కనుక ఓకే అయిన  వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని నైజాం ఏరియా లో సొంతం చేసుకున్న సినిమాల సరసన వినయ విదేయ రామ కూడా ఒకటిగా చేరడం ఖాయమని చెప్పొచ్చు.