Breaking News

2.0 స్క్రీన్ కౌంట్ తెలిస్తే మైండ్ బ్లాంక్..!

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ రోబో 2.0 మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ చివరికి ఈ నెల చివరన డేట్ ని ఫిక్స్ చేసుకోగా ఎలాంటి పోటి లేకుండా సోలో రిలీజ్ విషయంలో ఇండియా లో ఆల్ టైం రికార్డు లను నమోదు చేయబోతుంది ఈ సినిమా.
ఇండియా లో ఈ సినిమా సుమారు 7500 నుండి 8000 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట…అందులో హిందీ వర్షం 4500 లోపు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా తమిళ్ మరియు తెలుగు వర్షన్స్ సుమారు గా 3500 లోపు థియేటర్స్ లో రిలీజ్ కానుందట.
ఇక ఓవర్సీస్ లో సినిమా సుమారు 2000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 10 వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఇండియా తరుపున బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవనుంది. తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ 7000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా బాహుబలి 2 కూడా అదే రేంజ్ లో రిలీజ్ అయింది.